నాకు పెళ్లా!పెళ్లికొడుకెవరు? | Colours Swathi reacts on Marriage Rumours | Sakshi
Sakshi News home page

నాకు పెళ్లా!పెళ్లికొడుకెవరు?

May 26 2014 2:49 AM | Updated on Sep 2 2017 7:50 AM

నాకు పెళ్లా!పెళ్లికొడుకెవరు?

నాకు పెళ్లా!పెళ్లికొడుకెవరు?

‘ఏంటి?... నాకు పెళ్లా! నాకు తెలీదే... ముహూర్తం ఎప్పుడు? పెళ్లి కొడుకెవరు? ఎలా ఉంటాడు?’... ఓ కోలీవుడ్ చానల్ ఇంటర్‌వ్యూలో.. మీకు పెళ్లంటగా? అని ఓ జర్నలిస్ట్ అడిగితే

 ‘ఏంటి?... నాకు పెళ్లా! నాకు తెలీదే... ముహూర్తం ఎప్పుడు? పెళ్లి కొడుకెవరు? ఎలా ఉంటాడు?’... ఓ కోలీవుడ్ చానల్ ఇంటర్‌వ్యూలో.. మీకు పెళ్లంటగా? అని ఓ జర్నలిస్ట్ అడిగితే... ఆమెపై స్వాతి సంధించిన ప్రశ్నల పరంపర ఇది. ‘నా పెళ్లి గురించి మా అమ్మానాన్నకు కూడా లేని తొందర మీడియాకు ఎక్కువైపోయింది’ అని ఆ ఇంటర్‌వ్యూలో మీడియాపై సెటైర్లు విసిరారు స్వాతి. ‘‘ప్రస్తుతం కెరీర్‌ని చక్కదిద్దుకోవడమే నా పని. మరిన్ని సినిమాలు చేయాలి.
 
 ‘మంచి నటి’ అనిపించుకోవాలి. అప్పుడుగానీ పెళ్లి గురించి ఆలోచించను’’ అన్నారు స్వాతి. మీ ‘పెళ్లి’ గురించి మీడియాలో వదంతులు వినిపించినప్పుడు మీకు కోపం వచ్చిందా? అనడిగితే- ‘‘కాదు నవ్వొచ్చింది. ఇంట్లోవాళ్లు కూడా హాయిగా నవ్వుకున్నారు. అయితే... పోను పోను జనాల నుంచి ప్రశ్నలెక్కువయ్యాయి. దాంతో కాస్త చిరాకనిపించింది’’ అని చెప్పారు. ఆమె నటించిన తెలుగు సినిమా ‘కార్తీకేయ’, తమిళ సినిమా ‘వడకర్రీ’ త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement