నితిన్‌కి తగ్గ కథ ఇది | chinnadana nee kosam movie release on 25th December | Sakshi
Sakshi News home page

నితిన్‌కి తగ్గ కథ ఇది

Dec 8 2014 10:50 PM | Updated on Sep 2 2017 5:50 PM

నితిన్‌కి తగ్గ కథ ఇది

నితిన్‌కి తగ్గ కథ ఇది

ఇప్పటి ప్రేక్షకులు రొమాంటిక్ ఎంటర్‌టైనర్లనే కోరుకుంటున్నారు. వారి అభిరుచి మేరకే... కథలు ఎంచుకుంటున్నాం.

 ‘‘ఇప్పటి ప్రేక్షకులు రొమాంటిక్ ఎంటర్‌టైనర్లనే కోరుకుంటున్నారు. వారి అభిరుచి మేరకే... కథలు ఎంచుకుంటున్నాం. నితిన్ శారీరకభాషకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది’’ అని నిర్మాత నిఖితారెడ్డి అన్నారు. నితిన్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో నిఖితారెడ్డి, సుధాకరరెడ్డి నిర్మించిన చిత్రం ‘చిన్నదాన నీకోసం’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిఖితారెడ్డి మాట్లాడుతూ -‘‘నితిన్ గత విజయాలకు తీసి పోని రీతిలో ఉండాలనే కసితో ‘చిన్నదాన నీకోసం’ చిత్రాన్ని నిర్మించాం. నితిన్‌ది పక్కింటి అబ్బాయి తరహాలో ఉండే పాత్ర. భిన్నమైన శైలిలో సాగే ప్రేమకథ కావడం వల్ల... ఫ్రెష్‌నెస్ కోసం కొత్తమ్మాయి మిస్తీ చక్రవర్తిని కథానాయికగా తీసుకున్నాం. తనకు తెలుగు రాకపోయినా.. భావం అర్థం చేసుకొని చక్కగా నటించింది. కథానాయికల్ని అందంగా చూపించడంలో కరుణాకరన్ దిట్ట. ఈ సినిమాలో మిస్తీని ఆయన చాలా అందంగా చూపించారు’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement