రాంగోపాల్ వర్మపై మండిపడ్డ బోనీకపూర్! | Boney Kapoor: Ram Gopal Varma has a perverted mindset | Sakshi
Sakshi News home page

రాంగోపాల్ వర్మపై మండిపడ్డ బోనీకపూర్!

Dec 1 2015 4:35 PM | Updated on Sep 3 2017 1:19 PM

రాంగోపాల్ వర్మపై మండిపడ్డ బోనీకపూర్!

రాంగోపాల్ వర్మపై మండిపడ్డ బోనీకపూర్!

క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ శ్రీదేవిపై తన ప్రేమను ఎప్పుడూ దాచుకోలేదు.

ముంబై: క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ అందాల తార శ్రీదేవిపై తన అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. తాజాగా విడుదలైన తన జీవిత కథలో ఏకంగా ఒక చాప్టర్‌ నే ఆమెకు అంకితం ఇచ్చాడు. శ్రీదేవిని 'సౌందర్య దేవత'గా అభివర్ణిస్తూ.. ఆమె పట్ల తనకు ఉన్నది స్వచ్ఛమైన అభిమానం అని చెప్పాడు. అయితే, తన జీవిత కథ 'గన్‌ అండ్ థైస్‌'లో శ్రీదేవిపై రాసిన అధ్యాయం ఆమెకు తాను రాసిన ప్రేమలేఖ లాంటిదని, ఆమె పట్ల తనకున్న ఆకర్షణ ఒక డ్రగ్స్‌ లాంటిందంటూ రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.

వర్మ వ్యాఖ్యలపై శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాంగోపాల్‌ వర్మ ఒక వెర్రి మనిషి అని, అతనిది వికృత మనస్తత్వం (పర్వర్టెడ్‌ మైండ్‌సైట్‌) అని బోనీ మండిపడ్డాడు. పబ్లిసిటీ కోసమే రాము ఇలాంటి పనులు చేస్తున్నాడని బోనీ విమర్శించాడు.

Advertisement
 
Advertisement
Advertisement