హిందీలోనూ ఎన్టీఆర్‌ బయోపిక్‌ | Balakrishna official Debut Into Bollywood | Sakshi
Sakshi News home page

హిందీలోనూ ఎన్టీఆర్‌ బయోపిక్‌

Oct 14 2017 12:02 AM | Updated on Aug 29 2018 1:59 PM

Balakrishna official Debut Into Bollywood  - Sakshi

తెలుగువారి అభిమాన నటులు ఎన్టీఆర్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఇందుకు కారణం ఆయన జీవిత చరిత్రతో రెండు సినిమాలు తెరకెక్కనుండటమే. తేజ దర్శకత్వంలో తండ్రి పాత్రలో బాలకృష్ణ నటించి, ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. కాగా, ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పేరుతో రామ్‌గోపాల్‌ వర్మ కూడా ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కించనున్నట్లు స్పష్టం చేయడంతో పాటు ఫస్ట్‌ లుక్‌ కూడా రివీల్‌ చేయడం సంచలనం సృష్టించింది. ఒకే వ్యక్తి జీవితకథతో తెలుగులోనే రెండు సినిమాలు తెరకెక్కనుండటంతో ఎన్టీఆర్‌ని ఎవరు ఎలా చూపించనున్నారనే ఆసక్తి అప్పుడే మొదలైంది.

కాగా, బాలకృష్ణ–తేజ కాంబినేషన్‌లో రూపొందనున్న బయోపిక్‌ ఒక్క తెలుగుకే పరిమితం కావడం లేదు. హిందీలోనూ రూపొందనుంది. మరి.. తెలుగు–హిందీ చిత్రాలను ఏకకాలంలో తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ‘కర్ణ’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని టాక్‌. ఈ చిత్రం షూటింగ్‌ మరో మూడు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. జనవరిలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ని ప్రారంభించాలని బాలకృష్ణ–తేజ అనుకుంటున్నారట.

Advertisement
 
Advertisement
Advertisement