పైసా వసూల్ టైటిల్ సాంగ్ టీజర్ | Bala krishna Title Song promo | Sakshi
Sakshi News home page

పైసా వసూల్ టైటిల్ సాంగ్ టీజర్

Aug 16 2017 10:25 AM | Updated on Sep 17 2017 5:35 PM

పైసా వసూల్ టైటిల్ సాంగ్ టీజర్

పైసా వసూల్ టైటిల్ సాంగ్ టీజర్

నందమూరి బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పైసా వసూల్

నందమూరి బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పైసా వసూల్. అనుకున్న సమయం కన్నా నెల రోజులు ముందుగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఔట్ అండ్ ఔట్ మాస్ మాసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రేయా, ముస్కాన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా  కైరా దత్ ఐటెం సాంగ్ తో అలరించనుంది.

అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా స్టంపర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. 'నే అడుగెడితే.. షో మొదలెడితే.. అరె గుండీలు తీసి కాలరు ఎగరేస్తే..' అంటూ సాగే ఈ పాట నందమూరి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఆగస్టు 17న ఈ సినిమా ఆడియో వేడుక ఖమ్మంలో అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement