నా ప్రేమ కూడా ఒక ఉద్యమమే | Anand Deverakonda Dorasani Movie Trailer out | Sakshi
Sakshi News home page

నా ప్రేమ కూడా ఒక ఉద్యమమే

Jul 1 2019 10:56 AM | Updated on Jul 7 2019 11:45 AM

Anand Deverakonda Dorasani Movie Trailer out - Sakshi

ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌ జంటగా రాబోతోన్న దొరసాని చిత్రం గురించి అందరికీ తెలిసిందే. టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన చిత్రబృందం.. పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ‘దొరసాని’పై ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. విజయ్‌ దేవరకొండ తమ్మునిగా వెండితెరకు ఆనంద్‌ ఎంట్రీ ఇస్తుండగా.. రాజశేఖర్‌ కూతురు శివాత్మిక టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇదో స్వచ్చమైన ప్రేమ కథ అని టీజర్‌తో చెప్పేసిన మేకర్స్‌‌.. తాజాగా రిలీజ్‌ చేసిన ట్రైలర్‌లో తన ప్రేమకు గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలను చూపించారు. తెలిసిన కథే అయినా ట్రీట్‌మెంట్‌ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. సంగీతం, డైలాగ్‌లు, హీరోహీరోయిన్ల నటన ఈ చిత్రానికి పాజిటివ్‌గా మారనుంది. ముఖ్యంగా మాటలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచిపోయేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ టీజర్‌లోని.. ‘ఉద్యమంలో చావు కూడా ఓ విజయమే’., ‘నా ప్రేమ కూడా ఓ ఉద్యమమే’లాంటి డైలాగ్‌లు.. ‘కదిలించావు నన్నే గుండెను మీటి.. కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి’, ‘దొరసాని.. నిన్ను చూడని నిశిరాతిరి నేనొక రాలిన నక్షత్రం.. నీ ఊసులే లేని మలిసంధ్యలో నేనో కరిగిన మేఘం’ లాంటి గోడపై రాసిన కొటేషన్స్‌ ఈ ప్రేమకథలోని లోతును తెలిపేలా ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతాన్ని అందించారు. యష్‌ రంగినేని, మధుర శ్రీదర్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని కెవీఆర్‌ మహేంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement