కుదిరితే కొన్ని చిత్రాలు.. రొమాన్స్‌ సీన్స్‌ ! | Amy Jackson acts in 2.o movie | Sakshi
Sakshi News home page

కుదిరితే కొన్ని చిత్రాలు.. రొమాన్స్‌ సీన్స్‌ !

Nov 12 2017 9:38 PM | Updated on Nov 12 2017 9:39 PM

Amy Jackson acts in 2.o movie - Sakshi

చెన్నై: అంతేనా ఎమీ? కుదిరితే కొన్ని చిత్రాలు, అందులో మరికొన్ని రొమాన్స్‌ సీన్స్‌ అందించే అవకాశం ఉండదా? ఇది ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్ గురించి అభిమానుల అభిప్రాయం. ఇంతకీ ఏమిటీ ఎమీ గోల అనేగా మీ ఆసక్తి. మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన నటి ఎమీజాక్సన్‌. ఆ చిత్రం ఒక్కటే ఈ అమ్మడికి సరైన సక్సెస్‌. ఆ తర్వాత బహుళ ప్రాచుర్యం పొందిన చిత్రం ‘ఐ’.. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్య మిశ్రమ ఆదరణే అందుకుంది.

అయితే ఆ చిత్రంలో హద్దుల అంచుల వరకూ అందాలను ఆరబోసి అభిమానులను ఖుషీ పరిచింది. అందుకే ఎమీ కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు కోలీవుడ్‌నే నమ్ముకుని ఇక్కడే మక్కాం పెట్టింది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో సూపర్స్టార్‌ రజనీకాంత్‌కు జంటగా 2.ఓ చిత్రంలో నటించింది. ఈ చిత్రం కోసం రజనీ సహా చిత్ర వర్గాలు, సినీ వర్గాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎమీ కూడా 2.ఓ చిత్రం అందించే విజయం కోసం ఎదురు చూస్తోందని అనుకుంటున్నారు. నిజమే ఇదివరకూ ఆమె అలాంటి స్టేట్‌మెంట్‌ ఒకటి చేసింది.

 ఈ చిత్రం విజయం ఎమీకి చాలా అవసరం కూడా.  ఎందుకంటే ఈ జాణకు చేతిలో ఏ భాషలోనూ ఒక్క చిత్రం కూడా లేదు. ఇవేవీ పట్టించుకోకుండా హాలీవుడ్‌ సూపర్‌ గర్ల్‌ సిరీస్‌లో నటించడానికి అమెరికాలోని లాస్ఏంజెల్స్‌కు పరిగెత్తింది.  అంత వరకూ బాగానే ఉంది. ఈ అమ్మడు ఇక 2018 వరకూ ఇదే నా ఇల్లు అన్ని ట్విట్టర్‌లో పోస్టు చేసి ఇండియన్‌ అభిమానులకు పెద్ద షాక్‌ ఇచ్చింది.  దీంతో అంతేనా కుదిరినప్పుడైనా కోలీవుడ్‌లో కొన్ని చిత్రాలు లేదా సింగిల్‌ సాంగ్స్‌లో రొమాన్స్‌ చేసే అవకాశం లేదా అని ఎమీ అభిమానులు ట్విట్టర్‌లో అడుగుతున్నారు. మరి అభిమానుల కోసం అయినా ఎమీ మనసు మార్చుకుంటుందో.. లేదో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement