మెగాస్టార్ రేంజ్ ఇంతేనా..? | amitabh Bachchan, Ram gopal Varma Sarkar 3 Poor Collections | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ రేంజ్ ఇంతేనా..?

May 16 2017 10:58 AM | Updated on Sep 5 2017 11:18 AM

మెగాస్టార్ రేంజ్ ఇంతేనా..?

మెగాస్టార్ రేంజ్ ఇంతేనా..?

చిన్న సినిమాలు కూడా వసూళ్ల రికార్డులు సృష్టిస్తుంటే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజా చిత్రంతో

చిన్న సినిమాలు కూడా వసూళ్ల రికార్డులు సృష్టిస్తుంటే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజా చిత్రంతో అభిమానులకు షాక్ ఇచ్చాడు. కొంతకాలంగా తన ఫాంతో అభిమానులను ఇండస్ట్రీ జనాలను ఇబ్బంది పెడుతున్న రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా అంగీకరించి ష్యాన్స్కు షాక్ ఇచ్చిన అమితాబ్, తాజాగా ఆ సినిమా కలెక్షన్లతో మరోసారి నిరాశపరిచాడు.

బాలీవుడ్లో సక్సెస్ ఫుల్ సీరీస్గా గుర్తింపు తెచ్చుకున్న సర్కార్ సీరీస్లో మూడో భాగంగా రిలీజ్ అయిన సర్కార్ 3, మినిమమ్ కలెక్షన్లు కూడా సాధించలేకపోతోంది. వరున ఫెయిల్యూర్స్తో కెరీర్ ను కష్టాల్లో పడేసుకున్న వర్మ.. అమితాబ్తో సినిమా చేసి కూడా తన పంథా మార్చుకోలేదు. మరోసారి రొటీన్ టేకింగ్తో నిరాశపరిచాడు. దీంతో సర్కార్ 3 తొలి వీకెండ్లో కేవలం 6.75 కోట్లు మాత్రమే వసూళు చేసింది. తెలుగు సినిమాలు కూడా ఇంతకన్నా ఎక్కువ వసూళ్లు సాధిస్తున్న సమయంలో మెగాస్టార్ సినిమా  కలెక్షన్లు ఈ స్థాయిలో ఉండటం ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement