‘టామి’అందరికీ నచ్చుతుంది | Amala Akkineni Tommy is a good movie | Sakshi
Sakshi News home page

‘టామి’అందరికీ నచ్చుతుంది

Feb 12 2015 11:48 PM | Updated on Sep 2 2017 9:12 PM

‘టామి’అందరికీ నచ్చుతుంది

‘టామి’అందరికీ నచ్చుతుంది

డా. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో బాబూ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నిర్మాత, రాజకీయవేత్త చేగొండి హరిబాబు, బోనం చినబాబు నిర్మించిన చిత్రం ‘టామి’.

డా. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో బాబూ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నిర్మాత, రాజకీయవేత్త చేగొండి హరిబాబు, బోనం చినబాబు నిర్మించిన చిత్రం ‘టామి’. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కినేని అమలకు ఈ చిత్రం  ప్రివ్యూ చూపించారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ - ‘‘పెంపుడు కుక్కలు తమ యజమానుల పట్ల కనబర్చే విశ్వాసం ఎలాంటిదో చూపించే చిత్రం ఇది. పిల్లలు, పెద్దలూ అందరూ చూడాల్సిన చిత్రం. మూగజీవాల పట్ల మనుషులు చూపించాల్సిన ఆదరణ గురించి చెప్పిన ఈ చిత్రానికి ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలను కుంటున్నాను’’ అని చెప్పారు. ఈ చిత్రంలో భూగీ అనే శిక్షణ పొందిన శునకం నటించిందనీ, త్వరలోనే ప్రచార చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నామని దర్శక, నిర్మాతలు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement