తండ్రి కాబోతున్న హీరో గోపీచంద్ | actor Gopichand to become a dad soon | Sakshi
Sakshi News home page

తండ్రి కాబోతున్న హీరో గోపీచంద్

Oct 7 2014 9:13 PM | Updated on Sep 4 2018 5:15 PM

తండ్రి కాబోతున్న హీరో గోపీచంద్ - Sakshi

తండ్రి కాబోతున్న హీరో గోపీచంద్

యువ హీరో గోపీచంద్ వ్యక్తిగత, సినీ జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు.

యువ హీరో గోపీచంద్ వ్యక్తిగత, సినీ జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. లౌక్యం చిత్రం ద్వారా కెరీర్లో అత్యుత్తమ విజయం సాధించిన గోపీచంద్కు నిజ జీవితంలోనూ ప్రమోషన్ లభించింది. ఆయన త్వరలో తండ్రి కాబోతున్నారు. గోపీచంద్ భార్య రేష్మ ప్రస్తుతం గర్భవతి. మరో రెండు నెలల్లో బిడ్డకు జన్మనివ్వనున్నట్టు గోపీచంద్ సన్నిహితులు చెప్పారు. అయితే గోపీచంద్ కుటుంబం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.

గోపీచంద్ ఇంట్లో ఇటీవల జరిగిన శుభకార్యక్రమానికి అతని సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. గోపీచంద్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా యువ హీరో అత్యంత సంతోషంగా ఉన్నట్టు తెలిపారు.  హీరో గోపీచంద్‌ వివాహం రేష్మతో మే 12, 2013న  హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది.  గోపీచంద్ భార్య రేష్మ .. హీరో శ్రీకాంత్ కు బంధువు.

Advertisement
 
Advertisement
Advertisement