'ఆమీర్ఖాన్ ఓ లీడర్.. నేను చాలా నేర్చుకోవాలి' | Aamir Khan has always been a leader, inspiration, says Anil Kapoor | Sakshi
Sakshi News home page

'ఆమీర్ఖాన్ ఓ లీడర్.. నేను చాలా నేర్చుకోవాలి'

Jun 9 2016 11:55 AM | Updated on Apr 3 2019 6:34 PM

'ఆమీర్ఖాన్ ఓ లీడర్.. నేను చాలా నేర్చుకోవాలి' - Sakshi

'ఆమీర్ఖాన్ ఓ లీడర్.. నేను చాలా నేర్చుకోవాలి'

ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్.

ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్. బాలీవుడ్ లో ఒకప్పుడు అగ్రస్థానానికి వెళ్లిన హీరో అనిల్ కపూర్ ఇండస్ట్రీకి తన వారసుడిని కూడా పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్‌గా వెలుగొందుతుండగా, ఇప్పుడు కొడుకు హర్షవర్ధన్ కపూర్ కూడా అరంగేట్రం చేస్తున్నాడు. అయితే తనకంటే వయసులో చిన్నవాడైనా స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తనకు ఎప్పుడూ ఆదర్శప్రాయమని అంటున్నాడు. ఆమీర్ ఓ మంచి నాయకుడని, ఆయన నుంచి ప్రేరణ పొందుతుంటానని మరో స్టార్ నటుడు చెప్పడం విశేషం.

'24 సీజన్ 2' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అనిల్ తో పాటు సోనమ్ కపూర్,అభిమానులు 'మిస్టర్ ఫర్ఫెక్ట్' గా పిలుచుకునే ఆమీర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమీర్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు. మనకంటే వయసులో చిన్నవాళ్లయినా వారి నుంచి కూడా ఎంతో నేర్చుకోవచ్చని చెప్పాడు. తాను హిందీ, ఇంగ్లీష్ మూవీలతో బిజీగా ఉన్నప్పుడు ఆమీర్ మాత్రం 'సత్యమేవ జయతే' లాంటి ప్రోగ్రామ్స్ చేశాడని మెచ్చుకున్నాడు. 2013లో అమెరికా సిరీస్ టీవీ షో 24 వచ్చిందని, ప్రస్తుతం రెండో సీజన్ స్టార్ చేస్తున్నట్లు అనిల్ తెలిపాడు. తెరపై తాను చూడటానికి ఇష్టపడే వారిలో అనిల్ ఒకరని ఆమీర్ పేర్కొన్నాడు. అనిల్ ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని ఆయన మరిన్ని ఈవెంట్స్ చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. టీవీ షో ట్రైలర్ చూస్తే సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందని

Advertisement
 
Advertisement
Advertisement