'1' నేనొక్కడినే ఓపెనింగ్ కలెక్షన్ రూ. 8.4 కోట్లు | 1 Nenokkadine fails to register a bumper opening | Sakshi
Sakshi News home page

'1' నేనొక్కడినే ఓపెనింగ్ కలెక్షన్ రూ. 8.4 కోట్లు

Jan 12 2014 2:23 PM | Updated on Sep 2 2017 2:34 AM

'1' నేనొక్కడినే ఓపెనింగ్ కలెక్షన్ రూ. 8.4 కోట్లు

'1' నేనొక్కడినే ఓపెనింగ్ కలెక్షన్ రూ. 8.4 కోట్లు

'ప్రిన్స్' మహేష్బాబు నటించిన '1' నేనొక్కడినే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ. 8.4 కోట్లు కలెక్షన్లు వసూలు సాధించింది.

చెన్నై: 'ప్రిన్స్' మహేష్బాబు నటించిన '1' నేనొక్కడినే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ. 8.4 కోట్లు కలెక్షన్లు వసూలు సాధించింది. అయితే 'అత్తారింటికి దారేది' సినిమా ప్రారంభ వసూళ్లను '1' అధిగమించలేకపోయింది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు లేవని విశ్లేషకులు అంటున్నారు.

రూ. 70 కోట్లు బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 1400 స్ర్కీన్లపై విడుదల చేశారు. సైకాలజికల్ థిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. భారీ అంచనాలు, డిపెరెంట్ నేరేషన్, నిడివి ఎక్కువగా ఉండడం సినిమాకు ప్రతిబంధకంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. మిశ్రమ స్పందన వ్యక్తమవడంతో సినిమా నిడివి తగ్గించినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement