ఖతార్ పారిశ్రామికవేత్తలతో మోదీ సమావేశం | Sakshi
Sakshi News home page

ఖతార్ పారిశ్రామికవేత్తలతో మోదీ సమావేశం

Published Sun, Jun 5 2016 3:22 PM

ఖతార్ పారిశ్రామికవేత్తలతో మోదీ సమావేశం - Sakshi

దోహా: ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం గల్ఫ్ దేశం ఖతార్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దోహాలో ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ప్రధాని.. భారత్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలున్నాయని వెల్లడించారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవరోధాలను తొలగిస్తామని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

భారత్లో రైల్వేలు, సోలార్ ఎనర్జీ, వ్యవసాయోత్పత్తుల శుద్ధి వంటి రంగాల్లో ఖతార్ పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలున్నాయని మోదీ వెల్లడించారు. భారత్లోని 600 మిలియన్లకు పైగా ఉన్న యువత దేశానికి ప్రధాన బలమన్నారు. దేశంలో స్మార్ట్ సిటీ, మెట్రోస్ అండ్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తున్నామన్నారు.
 

Advertisement
Advertisement