బట్టలు ఉతకొద్దు... తొక్కితే చాలు! | . Cycle, a mix vasingmesin to this, bike washing machine 'has been made | Sakshi
Sakshi News home page

బట్టలు ఉతకొద్దు... తొక్కితే చాలు!

Jul 10 2014 3:39 AM | Updated on Sep 2 2017 10:03 AM

బట్టలు ఉతకొద్దు... తొక్కితే చాలు!

బట్టలు ఉతకొద్దు... తొక్కితే చాలు!

ఒకే పనికి రెండు ప్రయోజనాలు.. అటు ఆరోగ్యం, ఇటు దుస్తులు శుభ్రం. మనం చేయవల్సిందల్లా జస్ట్ ఈ సైకిల్ తొక్కడమే. చాలా మంది వ్యాయామం కోసం వారానికోసారైనా సైకిల్ తొక్కుతుంటారు.

ఒకే పనికి రెండు ప్రయోజనాలు.. అటు ఆరోగ్యం, ఇటు దుస్తులు శుభ్రం. మనం చేయవల్సిందల్లా జస్ట్ ఈ సైకిల్ తొక్కడమే. చాలా మంది వ్యాయామం కోసం వారానికోసారైనా సైకిల్ తొక్కుతుంటారు. అలాగే రోజూ లేదా వారానికోసారైనా బట్టలు ఉతుకుతుంటారు. మరి ఆ రెండు పనులనూ కలిపి ఒకేసారి చేసుకుంటే  పోలా? అని ఆలోచించిన చైనాలోని దలియన్ నేషనలిటిస్ యూనివర్సిటీ పరిశోధకులు.. సైకిల్‌ను, వాషింగ్‌మెషిన్‌ను కలగలిపి ఇలా ఈ ‘బైక్ వాషింగ్ మెషిన్’ను తయారు చేశారు.

దీని సైకిల్ పెడల్స్‌ను తొక్కుతుంటే వాషింగ్ మెషిన్‌లోని డ్రమ్ తిరుగుతుంది. అదే సమయంలో విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ను మెషిన్‌పై డిస్‌ప్లే స్క్రీన్ పనిచేయడానికి ఉపయోగించడమే కాకుండా.. బ్యాటరీలో కూడా నిల్వ చేసుకోవచ్చట. భలే ఉంది కదూ.. బట్టలుతకాలంటే ఇక ఉసూరుమనకుండా ఉత్సాహంగా సైకిల్ తొక్కొచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement