ఎయిర్‌పోర్టు రోడ్డుపై మహిళ మృతదేహం | woman dead body at shamshabad airport road | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు రోడ్డుపై మహిళ మృతదేహం

Aug 20 2016 10:04 AM | Updated on Sep 4 2017 10:06 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాతంరాయి వద్ద రహదారిపై ఓ మహిళ మృతదేహం పడి ఉంది.

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాతంరాయి వద్ద రహదారిపై ఓ మహిళ మృతదేహం శనివారం స్థానికులు గుర్తించారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని...మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మహిళను ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదంలో సదరు మహిళ మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement