బుల్లితెర నటికి అసభ్యకర మెసేజ్‌లు... | Vulgar messages to the small screen actress .. | Sakshi
Sakshi News home page

బుల్లితెర నటికి అసభ్యకర మెసేజ్‌లు...

Mar 12 2016 10:35 AM | Updated on Sep 3 2017 7:30 PM

బుల్లితెర నటికి అసభ్యకర మెసేజ్‌లు...

బుల్లితెర నటికి అసభ్యకర మెసేజ్‌లు...

గుర్తు తెలియని వ్యక్తి తనకు అసభ్యకర సందేశాలు పంపి మానసికంగా వేధిస్తున్నాడని బుల్లితెర నటి ఒకరు బంజారాహిల్స్ ...

బంజారాహిల్స్: గుర్తు తెలియని వ్యక్తి తనకు అసభ్యకర సందేశాలు పంపి మానసికంగా వేధిస్తున్నాడని బుల్లితెర నటి ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకా రం... శ్రీనగర్‌కాలనీ గణపతి కాంప్లెక్స్ సమీపంలో నివసించే ఎస్.భారతి (40) టీవీ షోల్లో నటిస్తోంది.

మూడు నెలలుగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుంచి ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో తాను తీవ్రమానసిక క్షోభకు గురవుతున్నానని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement