టీఎస్‌పీఈసెట్‌–2017 షెడ్యూల్‌ విడుదల | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఈసెట్‌–2017 షెడ్యూల్‌ విడుదల

Published Sat, Apr 15 2017 11:26 PM

TSPECET -2017 schedule release

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సెట్‌–2017 పరీక్ష షెడ్యూల్‌ను శనివారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కన్వీనర్‌ వి.సత్యనారాయణ విడుదల చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఈ పరీక్షను మే 29న నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ప్రకటించారు. రెండేళ్ల పాటు సాగే బీపీఈడీ, డీపీఈడీ కోర్సులు నాలుగు సెమిస్టర్లలో పూర్తవుతాయి.

ఈనెల 16న సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఈనెల 17 నుంచి మొదలవుతుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు జనరల్‌ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400గా నిర్దేశించారు. మే 15 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు  www. tsche. ac. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కన్వీనర్‌ సూచించారు.

Advertisement
Advertisement