ఫిల్మ్ ఛాంబర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత | Tension prevails in film chamber | Sakshi
Sakshi News home page

ఫిల్మ్ ఛాంబర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత

Oct 24 2014 11:22 AM | Updated on Aug 21 2018 5:46 PM

ఫిల్మ్ ఛాంబర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత - Sakshi

ఫిల్మ్ ఛాంబర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత

హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫిల్మ్ ఛాంబర్ను ముట్టడించేందుకు నిర్మాత

హైదరాబాద్ : హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫిల్మ్ ఛాంబర్ను ముట్టడించేందుకు నిర్మాత రామకృష్ణ గౌడ్ మద్దతుదారులు యత్నించారు.  ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి.  చిన్న సినిమాల పాలిట శాపంగా మారిన థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రామకృష్ణ గౌడ్ శనివారం నుంచి ఫిలిం చాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దీక్షపై ఎవరూ స్పందించకపోవటంతో రామకృష్ణ గౌడ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement