లైంగిక దాడిలో నిందితునికి పదేళ్లు జైలు | Ten years in prison, accused of sexual assault | Sakshi
Sakshi News home page

లైంగిక దాడిలో నిందితునికి పదేళ్లు జైలు

Mar 25 2015 9:42 PM | Updated on Jul 23 2018 9:13 PM

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితునికి కోర్టు బుధవారం పదేళ్లు జైలు శిక్ష విధించింది.

యాకుత్‌పురా: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితునికి కోర్టు బుధవారం పదేళ్లు జైలు శిక్ష విధించింది. మీరాలంమండి ముర్గీఖానా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఉస్మాన్ కుమారుడు మహ్మద్ సల్మాన్ (20) 2013 డిసెంబర్ 17వ తేదీన మైనర్ బాలిక (13)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో సల్మాన్‌తో పాటు మరో ముగ్గురు జూవైన ల్‌లపై కేసులు నమోదయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పట్లో నిందితున్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టులో కొనసాగుతున్న ఈ కేసుపై బుధవారం ఒకటవ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జి. లక్ష్మీపతి సల్మాన్‌కు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించి * 1000 ల జరిమానాను ఖరారు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement