సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు? | September In the Assembly meetings? | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు?

Aug 4 2015 2:44 AM | Updated on Aug 14 2018 10:54 AM

అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ మొదటి వారంలో 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది.

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ మొదటి వారంలో 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. సచివాలయంలో సోమవారం సీఎం కేసీఆర్‌ను కలసిన ఉన్నతాధికారులు, మంత్రులతో ఈ మేరకు పేర్కొన్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడవగానే ప్రతీ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ఆ పార్టీల నేతలకు ఏ మాత్రం ఓపిక లేకుండా అయిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రాణహిత-చేవెళ్లపై ప్రభుత్వం ఏం చెప్పినా వినిపించుకోకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నట్లు సమాచారం.

విపక్షాలకు ఘాటైన సమాధానం ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రజలకూ దీనిపై స్పష్టత ఇచ్చేందుకు తానే అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా వివరణ ఇస్తానని కేసీఆర్ పేర్కొన్నారని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement