గుండెపోటుతో సినీ నటి జ్యోతి మృతి | junior artist jyothi died on satarday with heart attac | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో సినీ నటి జ్యోతి మృతి

Feb 28 2016 3:50 AM | Updated on Sep 3 2017 6:33 PM

గుండెపోటుతో సినీ నటి జ్యోతి మృతి

గుండెపోటుతో సినీ నటి జ్యోతి మృతి

పలు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా నటించిన బండ జ్యోతి(55) శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు.

హైదరాబాద్: పలు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా నటించిన బండ జ్యోతి(55) శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. మణికొండ పంచాయతీ పరిధిలోని చిత్రపురి కాలనీలో తన తల్లితో పాటు ఉంటున్న ఆమె వారం రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆమె ఎలాంటి ఆహారం తీసుకోకపోవటంతో పల్స్ పడిపోయి శనివారం తెల్లవారు జామున గుండెపోటు రావటంతో మృతి చెందారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నారు. జ్యోతి మృతితో చిత్రపురి కాలనీలో విషాదం నెలకొంది. జ్యోతి మృతివార్త తెలుసుకున్న మూవీఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు కొమర వెంకటేశ్‌లు నివాళులర్పించారు. అనంతరం ఆమె అంత్యక్రియలను నగరంలో నిర్వహించేందుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement