⇒ ప్రస్తుతం ఆ నిబంధన అమలులోనే ఉంది
⇒ ధరించకుంటే రూ.100 జరిమానా
⇒ మరోసారి ఉల్లంఘనకు పాల్పడితే
⇒ రూ. 300 ఫైన్ స్పష్టం చేసిన హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే అని హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగాల అధికారులు స్పష్టం చేశారు. మోటారు వాహనాల చట్టంలో ఉన్న ఈ నిబంధన ప్రస్తుతం అమలులోనే ఉందని, ఉల్లంఘించిన వారికి రూ.100 జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు. అదే వ్యక్తి మరోసారి ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే ఈ జరిమానా రూ.300 వరకు విధించే అవకాశం ఉందని తెలిపారు. హెల్మెట్ ధరించని, నిషేధిత స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేసిన 300 మంది వాహనచోదకులకు మంగళవారం గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(టీటీఐ)లో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
రోజుకొకరు చనిపోతున్నారు..: హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపటం వల్ల హైదరాబాద్‌లో రోజుకొకరు చొప్పున మృత్యువాత పడుతుండగా.. నలుగురైదుగురు క్షతగాత్రులవుతున్నారని రంగనాథ్ చెప్పారు. మృత్యువాత పడుతున్న వారిలో దేశానికి వెన్నెముకగా నిలవాల్సిన 20 నుంచి 40 ఏళ్ల వయసువారే అధికంగా ఉంటున్నారన్నారు. వాహనచోదకుల సంక్షేమం కోసమే ట్రాఫిక్ పోలీసు విభాగం పని చేస్తోందని రంగనాథ్ చెప్పారు. టూవీలర్స్ డ్రైవ్ చేసే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధన మోటారు వాహనాల చట్టంలోనే పొందుపరిచి ఉందని, ఆ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నిబంధనా అమలులో ఉన్నట్లే అని నగర ట్రాఫిక్ చీఫ్ జితేందర్ చెప్పారు.
దీనికోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా ప్రకటన చేయాల్సిన అవసరం లేదన్నారు. అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తున్నామని, ఇటీవల న్యాయస్థానం దృష్టికీ ఈ విషయాన్ని తీసుకువెళ్ళామని చెప్పారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 70 వేల కేసులు నమోదు చేశామని, వాహనచోదకుల్లో అవగాహన కోసం మూడు లక్షల కరపత్రాలు, పోస్టర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ చీఫ్ అవినాష్ మహంతి స్పష్టం చేశారు.
హెల్మెట్ పెట్టుకోవాల్సిందే..
Published Wed, Dec 30 2015 1:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement