నగరంలో భారీ వర్షం | Sakshi
Sakshi News home page

నగరంలో భారీ వర్షం

Published Fri, Jun 5 2015 7:35 AM

heavy rain in hyderabad

హైదరాబాద్: నగరంలో బుధవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఆబిడ్స్, కోఠి, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మెహదీపట్నం, అంబర్‌పేట, ఉప్పల్, హయత్‌నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

తెల్లవారుజామున ఎల్బీనగర్‌లోని గెలాక్సీ హస్పిటల్ ఎదుట వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో చె ట్టు కొమ్మ విరిగిపడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.

Advertisement
Advertisement