‘ప్రిన్స్’తో అవకాశమొస్తే... | Had wanted to star in Telugu films | Sakshi
Sakshi News home page

‘ప్రిన్స్’తో అవకాశమొస్తే...

Aug 29 2015 1:04 AM | Updated on Jul 25 2018 2:35 PM

‘ప్రిన్స్’తో అవకాశమొస్తే... - Sakshi

‘ప్రిన్స్’తో అవకాశమొస్తే...

తెలుగు సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని.. అయితే ఆ అవకాశం మహేష్‌బాబు పక్కన దొరికితే అంతకుమించిన ఆనందం మరొకటి ...

తెలుగు సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని.. అయితే ఆ అవకాశం మహేష్‌బాబు పక్కన దొరికితే అంతకుమించిన ఆనందం మరొకటి లేదని బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా జోయా అఫ్రోజ్ అన్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో శుక్రవారం గ్లిడ్జ్ అండ్ గ్లామ్ దుస్తుల ప్రదర్శనకు సంబంధించిన సన్నాహక కార్యక్రమంలో భాగంగా బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సినిమాలు చాలా బాగుంటాయని, ఇటీవల బాహుబలి సినిమా చూశానన్నారు. హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదన్నారు.

దక్షిణాదిలో అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తానని చెప్పారు. ‘మొగల్ ఏ ఆజం’ సినిమా అంటే ఎంతో ఇష్టమని అందులో నటనకు పుష్కలమైన అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌వాసుల్లో ఎప్పుడూ హ్యాపీనెస్ కనబడుతుందని, అది తనకెంతో ఇష్టమన్నారు. కోకో కోలా యాడ్‌లో నటించడంతో మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘ఎక్స్‌పోజ్’ అనే సినిమాలో నటిస్తున్నానని ఆమె చెప్పారు.     - బంజారాహిల్స్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement