భండారి లేఅవుట్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత | Demolition of illegal structures in hyderabad bandari layout | Sakshi
Sakshi News home page

భండారి లేఅవుట్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

Dec 13 2016 6:53 PM | Updated on Sep 4 2017 10:38 PM

భండారి లేఅవుట్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

భండారి లేఅవుట్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత పనులను అధికారులు తిరిగి ప్రారంభించారు.

హైదరాబాద్‌: నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత పనులను అధికారులు తిరిగి ప్రారంభించారు. కూకట్‌పల్లి పరిధిలోని నిజాంపేట-భండారీ లేఅవుట్‌లో అక్రమ కట్టడాలను మంగళవారం కూల్చి వేశారు.  మొత్తం 8 అపార్టుమెంట్లను కూల్చివేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

భవన యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల సహకారంతో అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ కూల్చివేతల పనుల్లో హెచ్ఎండీఎ అధికారులతో పాటు నిజాంపేట గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలనీ మునిగిపోయి నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement