జూబ్లీహిల్స్లో బైక్ రేసింగ్లు అడ్డుకున్న పోలీసులు | bike racings in jubilee hills checkpost | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్లో బైక్ రేసింగ్లు అడ్డుకున్న పోలీసులు

Jul 3 2016 8:12 AM | Updated on Sep 4 2017 4:03 AM

నగరంలోని జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో యువకుల బైక్ రేసింగులకు ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు.

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో బైక్ రేసింగులు చేస్తున్న యువకులను ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో పోలీసులపై సదరు యువకులు చిందులు తొక్కారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు బైక్ రేసింగులకు పాల్పడుతున్న 16 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 16 బైకులతోపాటు రెండు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని... పోలీస్ స్టేషన్కు తరించారు. యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పోలీసులు పిలిపించారు. వారి సమక్షంలో యువకులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement