షాకిచ్చిన అక్షయ్! | Akshay sakicci! | Sakshi
Sakshi News home page

షాకిచ్చిన అక్షయ్!

Jan 20 2015 11:37 PM | Updated on Sep 2 2017 7:59 PM

షాకిచ్చిన అక్షయ్!

షాకిచ్చిన అక్షయ్!

బాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ సినిమాలతో బిజీగా ఉండే స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నిర్మాతలకు షాకిచ్చాడు.

బాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ సినిమాలతో బిజీగా ఉండే స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నిర్మాతలకు షాకిచ్చాడు. ‘హీరాఫేరీ 3’లో చేయమని వచ్చిన ఆఫర్‌కు ఏకంగా యాభై కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట. దెబ్బకు మైండ్ బ్లాకయ్యి షేకైన ఫిల్మ్ మేకర్స్ అక్షయ్‌కు రెండు చేతులూ ఎత్తి దండం పెట్టి.. మా వల్ల కాదంటూ జారుకున్నారట.

అక్షయ్ కూడా అంతివ్వలేకపోతే నేనూ చేయలేనంటూ ప్రాజెక్ట్ వదిలేసుకున్నాడని ఓ ఆంగ్ల పత్రిక కథనం. అయితే తనను అసలెవరూ అప్రోచ్ కాలేదంటూ రీసెంట్‌గా అక్షయ్ సెలవిచ్చాడు. ఇదిలా ఉండే... ‘బేబీ’ బాయ్ తప్పుకున్నాక... అభిషేక్‌బచ్చన్, జాన్ అబ్రహమ్‌లు ఈ చిత్రానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement