ప్రాణం తీసిన వీకెండ్ రేసింగ్ | Bike racer hits padesteriran, died | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వీకెండ్ రేసింగ్

Dec 4 2016 7:49 AM | Updated on Sep 4 2017 9:54 PM

బంజారాహిల్స్ లో ఆదివారం తెల్లవారుజామున బైక్ రేసర్లు రెచ్చిపోయారు.

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో ఆదివారం తెల్లవారుజామున బైక్ రేసర్లు రెచ్చిపోయారు. డ్రాగ్ రేసు సందర్భంగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ రేసర్ ఢీ కొట్టాడు. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న గోపాల్ అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, రేసర్ నదీమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రేసర్ నదీమ్ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Advertisement
 
Advertisement
Advertisement