ఇది ఉంటే ఆరోగ్యానికి ఢోకా లేదు! | will protect our helath if we have these items | Sakshi
Sakshi News home page

ఇది ఉంటే ఆరోగ్యానికి ఢోకా లేదు!

Sep 7 2014 1:05 AM | Updated on Sep 2 2017 12:58 PM

ఇది ఉంటే ఆరోగ్యానికి ఢోకా లేదు!

ఇది ఉంటే ఆరోగ్యానికి ఢోకా లేదు!

మనకు వచ్చే సగం ఆరోగ్య సమస్యలు ఆహారం వల్లే వస్తాయంటారు వైద్యులు. ముఖ్యంగా నూనె, నెయ్యి, డాల్డా వంటి వాటి వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు.

మనకు వచ్చే సగం ఆరోగ్య సమస్యలు ఆహారం వల్లే వస్తాయంటారు వైద్యులు. ముఖ్యంగా నూనె, నెయ్యి, డాల్డా వంటి వాటి వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. అది తెలిసి కూడా మనం వాటిని పక్కన పెట్టేయలేం. ఎందుకంటే... పొయ్యి మీద చేసే వంటకు వీటిలో ఏదో ఒకటి ఉండాలి. లేదంటే వేపుడు మాడిపోతుంది. కూర గిన్నెకు అంటుకుపోతుంది. అందుకే వాటిని కాస్త ఎక్కువగానే తగిలిస్తుంటాం. అదే మన దగ్గర బీబీక్యూ ఉందనుకోండి... అలాంటి సమస్యా ఉండదు. మన ఆరోగ్యానికి ఢోకానూ ఉండదు!
 
 అయితే బీబీక్యూలు అంత తక్కువ ధరకేమీ దొరకవు. మూడు నాలుగు వేలు పెట్టాల్సిందే. అంత పెట్టడం కష్టం అనుకుంటే ఈ మినీ బీబీక్యూని కొనుక్కోవడం మంచిది. దీని వెల రెండు వేల లోపే. ఆన్‌లైన్లో అయితే రూ. 1360 నుంచి మొదలవుతోంది. దీనికి నూనెతో పని ఉండదు. కూరగాయల దగ్గర్నుంచి మాంసం, చేపలు, రొయ్యల వరకూ అన్నిటినీ దీనిమీద చక్కగా కాల్చుకోవచ్చు. బోలెడన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టనూ వచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement