చంద్రబింబం: సెప్టెంబర్ 7 నుండి 13 వరకు | Funday Astrology of the week: Sept 7 to Sept 13 | Sakshi
Sakshi News home page

చంద్రబింబం: సెప్టెంబర్ 7 నుండి 13 వరకు

Sep 7 2014 1:31 AM | Updated on Sep 2 2017 12:58 PM

చంద్రబింబం: సెప్టెంబర్ 7 నుండి 13 వరకు

చంద్రబింబం: సెప్టెంబర్ 7 నుండి 13 వరకు

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ప్రయాణాలు.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ముఖ్యమైన కేసు పరిష్కారదిశ కు చేరుకుంటుంది. అరుదైన ఆహ్వానాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్య సూచనలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ప్రారంభంలో చికాకులు కలిగినా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి ఊరటనిస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వాహనయోగం. సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారులు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరం. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 కొన్ని వ్యవహారాలు మందగించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో అనారోగ్య సూచనలు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.  వాహన, గృహయోగాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి కాగలవు. ఆశయాలు నెరవేరతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన. వ్యాపారులు  ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువులు, మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు పదవులు లభించవచ్చు. వారం మధ్యలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. వ్యాపారులు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొంత అసంతృప్తి తప్పదు. వారం చివరిలో ధన, వస్తులాభాలు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 కృషి ఫలిస్తుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల సలహాలతో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహన, గృహయోగాలు. అనుకోని ఆహ్వానాలు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి  మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది.  ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.  వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు.
 - సింహంభట్ల సుబ్బారావు,
 జ్యోతిష పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement