సెలబ్రిటీలకే సెలబ్రిటీలు! | Celebrities and their Pets on Pinterest | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీలకే సెలబ్రిటీలు!

Feb 22 2015 9:09 AM | Updated on Sep 27 2018 8:55 PM

సెలబ్రిటీలకే సెలబ్రిటీలు! - Sakshi

సెలబ్రిటీలకే సెలబ్రిటీలు!

వాటితో కొంతసేపు గడిపితే మన నేచర్ మారిపోతుంది...

ఫొటో స్టోరీ
‘వాటితో కొంతసేపు గడిపితే మన నేచర్ మారిపోతుంది. కొంత పెడితే సంతోషిస్తాయవి. మనుషులకే ఎంత పెట్టినా చాలదు...’ పెట్స్ గురించి, అంతర్లీనంగా మనుషుల గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఫిలాసఫీ ఇది. మనుషుల గురించి అందరికీ తెలుసు. పెట్స్ గురించి మాత్రం వాటితో గడిపినప్పుడే తెలుస్తుంది. అలా గడిపేవారికే పూరి ఫిలాసఫీలోని గాఢత అర్థం అవుతుంది. సెలబ్రిటీల జీవితంలో ఖరీదైన దుస్తులు, కార్లు, వాచీలు ఎలాగో... ఈ ఖరీదైన కుక్కపిల్లలు కూడా అలాగే! ఇంకా చెప్పాలంటే ఇవి ఆ సెలబ్రిటీలకే సెలబ్రిటీలు.



ఇక్కడ ఈ సినిమా వాళ్ల గురించే కాదు... పెట్స్ గురించి కూడా చెప్పాలి.  ఏ జాతివి అయితేనేం,  ఏ దేశం నుంచి దిగుమతి చేసుకొన్నవైతేనేం... సృష్టిలో కెల్లా విశ్వాసం గలవి అనే జాతికి చెందినవి. తమను పెంచిపోషిస్తున్న వారిపై అపారమైన ప్రేమను కురిపిస్తాయి. పూరి జగన్నాథ్, మంచు లక్ష్మి, జయప్రద, మంచు మనోజ్‌కుమార్... తమ తమ పెట్స్‌తో మురిపెంగా ప్రేమాభిమానాలను పంచుకొంటున్నప్పుడు క్లిక్‌మనిపించినవి ఈ ఫోటోలు. ఇవి చాలు మూగజీవులతో అనుబంధం ఎంత ఆనందాన్నిస్తుందో చెప్పడానికి!



 

Advertisement
 
Advertisement
Advertisement