చాయ్ సమోసా.. స్టార్ హోటల్ | Irani tea and Samosas famous in Star hotel of Hyderabad | Sakshi
Sakshi News home page

చాయ్ సమోసా.. స్టార్ హోటల్

Aug 2 2014 1:49 AM | Updated on Sep 4 2018 4:52 PM

చాయ్ సమోసా.. స్టార్ హోటల్ - Sakshi

చాయ్ సమోసా.. స్టార్ హోటల్

చల్లగాలి అల్లరి చేస్తూ గిరికీలు కొడుతుంటే.. గొంతులో వెచ్చగా ఇరానీ చాయ్ జారాలని కోరుకోనివారెవరూ ఉండరు. ఇక పక్కా హైదరాబాదీలైతే దానికి సమోసాను కూడా జోడించి ఆస్వాదిస్తారు.

చల్లగాలి అల్లరి చేస్తూ గిరికీలు కొడుతుంటే.. గొంతులో వెచ్చగా ఇరానీ చాయ్ జారాలని కోరుకోనివారెవరూ ఉండరు. ఇక పక్కా హైదరాబాదీలైతే దానికి సమోసాను కూడా జోడించి ఆస్వాదిస్తారు. ఈ మాన్‌సూన్‌కి అంతకన్నా పర్‌ఫెక్ట్ మెనూ ఏముంటుం ది? అందుకే... హోటల్ మారియట్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ‘చాయ్ విత్ సమోసా’ టేస్ట్‌ను తెచ్చింది చాయ్ ప్రియుల కోసం. ఈ నెల 17 వరకు కొనసాగే ఈ ఫెస్ట్‌లో వెజ్, నాన్‌వెజ్ సమోసాతోపాటు వివిధ రకాల టీలు, బిస్కెట్స్ అందుబాటులో ఉన్నాయి.
 
 వావ్ అనాల్సిందే...
 ఆలూ అండ్ గ్రీన్‌పీస్ సమోసా, క్యారెట్ అండ్ బీన్స్ సమోసాతో జింజర్ టీ టేస్ట్ చేసే ఎంతటివారైనా వావ్ అనాల్సిందే. ఆంధ్రా చిల్లీ చికెన్, మిరియూల మటన్ సమోసాతో ఇలాచీ చాయ్, కాన్ అండ్ స్పినచ్ సమోసాతో లెమన్ చాయ్ కాంబినేషన్స్ రుచికే కాదు ఆరోగ్యానికి మంచిది. పాలు, చక్కెర లేకుండా, కొంత తేనె కలిపి తయారుచేసిన ‘లెమన్ గ్రాస్ టీ’ రుచి అమోఘం. ఇది సీనియర్ సిటిజన్స్ హాట్ ఫేవరేట్!
     - చెఫ్ ఎం.మధుసూదన్‌రావు  
 
 సమోసా... వెజ్
 ఆలూ అండ్ గ్రీన్‌పీస్ సమోసా
 పన్నీర్ అండ్ అనియన్ సమోసా
 కాన్ అండ్ స్పినచ్ సమోసా
 క్యారెట్ అండ్ బీన్స్ సమోసా
 నాన్ వెజ్
 మటన్ కీమా సమోసా
 చికెన్ టిక్కా సమోసా
 మిర్యాల మాంసం సమోసా
 ఆంధ్రా చిల్లీ చికెన్ సమోసా
 వెరైటీస్ ఇలాచీ, జింజర్, మసాలా, లెమన్ గ్రాస్ టీ
 తీపిని ఇష్టపడేవారికి స్వీట్ సమోసా కూడా ఉంది

Advertisement
 
Advertisement
Advertisement