అక్టోబర్ 2న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On October 2, the birthday celebration is buying Celebrities | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 2న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Oct 1 2015 11:46 PM | Updated on Sep 3 2017 10:18 AM

అక్టోబర్  2న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

అక్టోబర్ 2న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 11. ఇది చాలా ప్రత్యేకతను సంతరించుకున్న సంఖ్య.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
రచన (నటి), కె.కె. మీనన్ (నటుడు)

 
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 11. ఇది చాలా ప్రత్యేకతను సంతరించుకున్న సంఖ్య. దీనిలో రెండు ఒకట్లు (సూర్యుని సంఖ్య) కలిసి చంద్రుని సంఖ్య 2 ఏర్పడింది కాబట్టి ఇది మాస్టర్ నంబర్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీరు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండి, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. పోయిన సంవత్సరం ప్రారంభించిన ప్రాజెక్టుల నుంచి మంచి లాభాలు గడిస్తారు. వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి.

ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. దానివల్ల ఖర్చులు ఎక్కువ అయినప్పటికీ, మంచి ఫలితం కూడా ఉంటుంది. వీరు బిల్డర్లు గనుక అయితే వీరికిది ల్యాండ్‌మార్క్ ఇయర్‌గా మిగిలిపోతుంది. అయితే చంద్రుని దుష్ర్పభావం వల్ల వీరికి ఈ సంవత్సరం మానసికాందోళన, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, మూడీగా అయిపోతుండటం వంటి ప్రమాదాలున్నాయి కాబట్టి ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండటం మంచిది.

లక్కీ నంబర్స్: 1, 2, 3, 6, 7; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్; లక్కీ డేస్: శుక్ర, శని, ఆది, సోమవారాలు. సూచనలు: అమ్మవారిని ఆరాధించడం, తల్లిని కానీ, తల్లితో సమానురాలైన వారిని కానీ ఆదరించి, గౌరవించి సేవ చేయడం, ఆలయాలలో, మదరసాలలో, చర్చిలలో అన్నదానం చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్,
 ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్
 
 

Advertisement
 
Advertisement
Advertisement