నీ పేరేంటి మిస్‌? | mister movie location photo revealed | Sakshi
Sakshi News home page

నీ పేరేంటి మిస్‌?

Mar 18 2017 11:51 PM | Updated on Sep 5 2017 6:26 AM

సీన్‌ చెక్‌ చేస్తున్న శ్రీను వైట్ల, వరుణ్‌తేజ్, లావణ్య

సీన్‌ చెక్‌ చేస్తున్న శ్రీను వైట్ల, వరుణ్‌తేజ్, లావణ్య

‘మిస్టర్‌ నీ పేరేంటి?’ అని లావణ్యా త్రిపాఠి అడిగితే... ‘పిచ్చయ్య నాయుడు’ అని వరుణ్‌తేజ్‌ చెప్తారు.

‘మిస్టర్‌ నీ పేరేంటి?’ అని లావణ్యా త్రిపాఠి అడిగితే... ‘పిచ్చయ్య నాయుడు’ అని వరుణ్‌తేజ్‌ చెప్తారు. ఆమె మాత్రం తన పేరు చెప్పకుండా... ‘నాది చాలా మంచి పేరు, అందమైన పేరు, అర్థవంతమైన పేరు’ అని సస్పెన్స్‌లో పడేస్తారు. హీరోను ఊరించి, ఉడికించిన లావణ్య ఎప్పుడు పేరు చెప్తారో ఏప్రిల్‌ 14న తెలుస్తుంది.

ఎందుకంటే వరుణ్‌తేజ్‌ హీరోగా లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తున్న ‘మిస్టర్‌’ సినిమా వచ్చే నెల 14న రిలీజ్‌ కానుంది. పైన చెప్పిన సీన్‌ ‘మిస్టర్‌’ లోనిదే. ఆ సీన్‌ తీసిన తర్వాత మానిటర్‌ లో చూసుకుంటున్నప్పుడు తీసిన ఫొటోనే ఇక్కడ మీరు చూస్తున్నా రు. రెండు పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

Advertisement
 
Advertisement
Advertisement