పచ్చి టొమాటోలు త్వరగా పండాలంటే... | kitchen tips for tamato's | Sakshi
Sakshi News home page

పచ్చి టొమాటోలు త్వరగా పండాలంటే...

Jul 24 2016 12:15 AM | Updated on Sep 4 2017 5:54 AM

పచ్చి టొమాటోలు త్వరగా పండాలంటే...

పచ్చి టొమాటోలు త్వరగా పండాలంటే...

బాత్రూమ్ నుంచి వదలకుండా దుర్వాసన వస్తుంటే... బాత్రూమ్‌లో రెండు మూడు ఆగ్గిపుల్లలను వెలిగించి ఆర్పేయండి. కాసేపటికి ఆ వాసన పోతుంది.

ఇంటిప్స్

బాత్రూమ్ నుంచి వదలకుండా దుర్వాసన వస్తుంటే... బాత్రూమ్‌లో రెండు మూడు ఆగ్గిపుల్లలను వెలిగించి ఆర్పేయండి. కాసేపటికి ఆ వాసన పోతుంది.

పాలు కాచినప్పుడు గిన్నె అడుగున అంటుకుంటూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే పాలను తడి గిన్నెలో వేసి స్టౌ మీద పెట్టాలి. లేదంటే ముందు నీళ్లు పోసి, తర్వాత పాలు పోయాలి.

అరిగి మిగిలిపోయిన సబ్బు ముక్కలను ఓ గిన్నెలో వేసి, వాటిపై కొద్దిగా గ్లిజరిన్‌ను నీటిని పోయాలి. కాసేపటికి సబ్బు కరిగిపోతుంది. అప్పుడా లిక్విడ్‌ని బాటిల్‌లో వేసి పెట్టుకుంటే హ్యాండ్‌వాష్‌లా వాడుకోవచ్చు.

అద్దాలు, గాజు వస్తువులు కిందపడి పగిలినప్పుడు ఎంత శుభ్రం చేసినా కంటికి కనిపించనంత చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడా ఉండిపోతాయి. వాటిని శుభ్రం చేయాలంటే... బ్రెడ్ సై్‌‌లస్‌తో ఆ ప్రాంతమంతా అద్దాలి. అప్పుడా ముక్కలు వాటికి అంటుకుంటాయి.

పచ్చి టొమాటోలు త్వరగా పండాలంటే... వాటిని ఓ బ్రౌన్ బ్యాగ్‌లో వేసి గాలి, వెలుతురు తగలని చోట ఉంచాలి.

Advertisement
 
Advertisement
Advertisement