వాళ్లున్నారే... భలే కుళ్లుబోతులు! | I'm actually rottenness | Sakshi
Sakshi News home page

వాళ్లున్నారే... భలే కుళ్లుబోతులు!

Jul 12 2015 11:09 PM | Updated on Sep 3 2017 5:23 AM

వాళ్లున్నారే...  భలే కుళ్లుబోతులు!

వాళ్లున్నారే... భలే కుళ్లుబోతులు!

‘క్వీన్’, ‘తనూ వెడ్స్ మనూ’ సినిమాలతో కంగనా రనౌత్ దశ తిరిగింది.

 గాసిప్

‘క్వీన్’, ‘తనూ వెడ్స్ మనూ’ సినిమాలతో కంగనా రనౌత్ దశ తిరిగింది. ఒకప్పుడు ఆమెను పట్టించుకోని వాళ్లు, చిన్నచూపు చూసిన వాళ్లు కూడా ఇప్పుడు సందర్భం కలిపించుకొని మరీ కంగనాను పొగుడుతున్నారు. అయితే అలాంటివి కంగనా చెవికెక్కించుకుందో లేదో తెలియదు.

 ముక్కుసూటిగా మాట్లాడుతుందని కంగనాకు  పేరు. ఎన్నో సార్లు ఈ విషయం రుజువైంది. ‘‘మిమ్మల్ని చూసి కుళ్లుకునే వాళ్లు ఉన్నారా?’’ అనే ప్రశ్నకు- ‘‘లేకేం... చాలామంది ఉన్నారు... నేను అంటే ఎక్కడ లేని కుళ్లు వాళ్లకి...’’ అని సమాధానం చెప్పింది.
 ఒక ప్రముఖ దర్శకుడిని ఉద్దేశించి కంగనా ఆ మాట అన్నదని, అదేమీ కాదు... తన గురించి తేలిగ్గా మాట్లాడిన ఒక ప్రముఖ హీరో గురించి మాట్లాడిందని... ఇలా ఏవేవో పేర్లు  వినిపిస్తున్నాయి.  ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్‌లపైనే  తన కోపాన్ని చాటుకుందని అత్యధికులు అంటున్నారు. నిజాలు మనకేం ఎరుక? కంగనాకే ఎరుక!
 

 
 

Advertisement
 
Advertisement
Advertisement