పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | Birthday celebrating Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Sep 5 2015 11:37 PM | Updated on Sep 3 2017 8:48 AM

పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5...

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు : రాకేష్ రోషన్ (దర్శక-నిర్మాత), అభినవ్ కశ్యప్ (దర్శకుడు)

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య. పుట్టిన తేదీ 6. ఇది శుక్ర సంఖ్య. బుధ శుక్రుల కలయిక వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ సంవత్సరం విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కోరుకున్న ఇన్‌స్టిట్యూషన్లలో సీటు వస్తుంది. వ్యాపారుల సమయానుకూలంగా తగిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార వృద్ధి, కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు మంచి పనితీరు కనబరచి ప్రశంసలు అందుకుంటారు. మీరు 6వ తేదీన పుట్టినందువల్ల జీవితం ఆనందంగా, ఉత్సాహంగా, సౌఖ్యవంతంగా గడిచిపోతంంది. ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. వివాహ యత్నాలలో ఉన్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. స్పెక్యులేషన్ బాగా లాభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. మీడియా, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు, గుర్తింపు వస్తాయి. కోపం తగ్గించుకోవడం మంచిది.
 
లక్కీ నంబర్స్:
5,6,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రీన్, శాండల్; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు. సూచనలు: తోబుట్టువులను ఆదుకోవడం, నవగ్రహాభిషేకం చేయించుకోవడం, బీదవిద్యార్థులకు పుస్తకాలు, ఆహారం పంపిణీ చేయడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement