బాదంతో చర్మకాంతి | beauty tips | Sakshi
Sakshi News home page

బాదంతో చర్మకాంతి

Mar 13 2017 12:03 AM | Updated on Sep 5 2017 5:54 AM

బాదంతో చర్మకాంతి

బాదంతో చర్మకాంతి

బాదం పలుకులను గ్రైండ్‌ చేసి కొన్ని చుక్కల తేనె, అర టీ స్పూన్‌ గోరువెచ్చని పాలు కలిపి పేస్ట్‌ చేయాలి.

బ్యూటిప్స్‌

బాదం పలుకులను గ్రైండ్‌ చేసి కొన్ని చుక్కల తేనె, అర టీ స్పూన్‌ గోరువెచ్చని పాలు కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చర్మం నిగారిస్తుంది. పాలలో గంటసేపు నానబెట్టిన బాదం పలుకులని పేస్ట్‌ చేయాలి.

దీంట్లో కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రపరచిన ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరవాత కడిగేస్తే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement