
అనిల్ కపూర్ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది. రంగు రంగు దీపాలతో, పుష్పాలంకరణతో ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. సో.. సోనమ్ కపూర్, ఆనంద్ అహూజాల పెళ్లి మాట నిజమేనన్న మాట. బిజినెస్‌మేన్ ఆనంద్, సోనమ్ కొన్నాళ్లుగా లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ నెల 7, 8 తేదీల్లో వీరి వివాహ వేడుకలు జరుగుతాయట. కూతురి పెళ్లి వేడుక తీప్తి గుర్తుగా మిగిలిపోవడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అనిల్ కపూర్ అన్నీ తీసుకుంటున్నారట.
పెళ్లవగానే ఆనంద్, సోనమ్ హనీమూన్ చెక్కేస్తారని సమాచారం. అయితే అది లాంగ్ హనీమూన్ కాదు. జస్ట్ అలా వెళ్లి ఇలా వచ్చేస్తారట. పెళ్లైన వారానికే సోనమ్ ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీ అయ్యేంతగా ఆమె డైరీ నిండిపోయిందని భోగట్టా. ఆల్రెడీ 14, 15 తేదీల్లో జరగనున్న ఈవెంట్స్‌కు కమిట్‌మెంట్ ఇచ్చారని టాక్. ఆ వెంటనే త్వరలో విడుదల కానున్న ‘వీరే ది వెడ్డింగ్’ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీ అవుతారట. మరోవైపు ఫ్రాన్స్‌లో జరగనున్న కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనాలనుకుంటున్నారట. దీన్నిబట్టి చూస్తుంటే సోనమ్ వెరీ ప్రొఫెషనల్ అనిపిస్తోంది కదూ.