'విశాఖ ఉక్కును కాపాడుకుందాం' | ys vijayamma compaigning in visakha steel plant | Sakshi
Sakshi News home page

'విశాఖ ఉక్కును కాపాడుకుందాం'

May 3 2014 10:02 AM | Updated on Jul 25 2018 6:03 PM

'విశాఖ ఉక్కును కాపాడుకుందాం' - Sakshi

'విశాఖ ఉక్కును కాపాడుకుందాం'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ప్లాంట్ను సంరక్షిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ అన్నారు.

విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ప్లాంట్ను సంరక్షిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె విశాఖ స్టీల్ప్లాంట్ గేటు వద్ద ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ ఏ సంస్థను కూడా  ప్రైవేటీకరణ చేయబోమన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ను విస్తరణ చేస్తామని, విశాఖపట్నానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏమి చేయాలనుకున్నారో అన్నీ చేస్తామన్నారు. ఉక్కు గనుల కొరతను తీర్చటంతో పాటు ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్రంతో పోరాడైనా స్టీల్ప్లాంట్ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement