వైఎస్సార్ కాంగ్రెస్‌కు బాసటగా నిలవండి | support to YSR Congress | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ కాంగ్రెస్‌కు బాసటగా నిలవండి

Apr 26 2014 4:05 AM | Updated on Aug 14 2018 4:21 PM

వైఎస్సార్ కాంగ్రెస్‌కు బాసటగా నిలవండి - Sakshi

వైఎస్సార్ కాంగ్రెస్‌కు బాసటగా నిలవండి

సూపర్‌స్టార్ కృష్ణ-మహేష్ అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన నిలవాలని కృష్ణ మహేష్ అభిమాన సంఘ గౌరవాధ్యక్షుడు, పార్టీ నాయకుడు ఆదిశేషగిరిరావు పిలుపునిచ్చారు.

కృష్ణ-మహేష్ ఫ్యాన్స్‌కు ఆదిశేషగిరిరావు పిలుపు
 
 విశాఖపట్నం  సూపర్‌స్టార్ కృష్ణ-మహేష్ అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన నిలవాలని కృష్ణ మహేష్ అభిమాన సంఘ గౌరవాధ్యక్షుడు, పార్టీ నాయకుడు ఆదిశేషగిరిరావు పిలుపునిచ్చారు. విశాఖలో శుక్రవారం రాత్రి జరిగిన కృష్ణ అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ప్రవర్తన కృష్ణను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని చెప్పారు. వైఎస్ అంటే కృష్ణకు చాలా ఇష్టమ న్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆయనకు అపార నమ్మకముందని, అందువల్లే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. జగన్‌ను అధికారంలోకి తెచ్చేందుకు అభిమానులందరూ పనిచేయాలని కృష్ణ పిలుపునిచ్చారన్నారు.

ప్రచారంలో కృష్ణ- మహేష్ అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పాల్గొనాలని కోరారు. పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు విజయ్‌చందర్ మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్  టీడీపీ, బీజేపీలను భూస్థాపితం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఎంతమంది సినిమావాళ్లను కలిపి ప్రచారం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి గెలుపును ఆపలేరన్నారు. సినిమాల్లో మహేష్ నంబర్ వన్ డేరింగ్ హీరో అయితే.. రాజకీయాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నంబర్ వన్ డేరింగ్ నాయకుడని కితాబిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement