హ్యాట్రిక్ రేసులో ఐదుగురు వీరులు | some leaders hat-trick race in nizamabad district politicals | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ రేసులో ఐదుగురు వీరులు

Apr 28 2014 2:23 PM | Updated on Sep 17 2018 8:21 PM

హ్యాట్రిక్ రేసులో ఐదుగురు వీరులు - Sakshi

హ్యాట్రిక్ రేసులో ఐదుగురు వీరులు

ఎన్నికలలో వరుసగా మూడుసార్లు గెలవడం అరుదు. ఇలా గెలిస్తే హ్యాట్రిక్ సాధించారంటాం.

నిజామాబాద్ : ఎన్నికలలో వరుసగా మూడుసార్లు గెలవడం అరుదు. ఇలా గెలిస్తే హ్యాట్రిక్ సాధించారంటాం. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నవారిలో పలువురు అభ్యర్థులు ఈ అరుదైన ఘనత సాధించటానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్థన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు.

నిజామాబాద్ అర్బన్ నుంచి రెండుసార్లు గెలిచిన యెండల లక్ష్మీనారాయణ సైతం హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సైతం ఈ ఘటన సాధించటానికి ఒక్క విజయం దూరంలోనే ఉన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ నమోదు చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నాలుగో విజయం కోసం మరోసారి బోధన్ నుంచే బరిలో నిలిచారు. ఆయన 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement