మోడీపై ‘బీహార్ లాడెన్’ పోటీ. | Gujarat, Bihar Laden 'competition. | Sakshi
Sakshi News home page

మోడీపై ‘బీహార్ లాడెన్’ పోటీ.

Apr 19 2014 1:50 AM | Updated on Aug 15 2018 2:14 PM

మోడీపై ‘బీహార్ లాడెన్’ పోటీ. - Sakshi

మోడీపై ‘బీహార్ లాడెన్’ పోటీ.

‘బీహార్ లాడెన్’గా పేరు పొందిన మీరజ్ ఖలీద్ నూర్ ఈ ఎన్నికల్లో నేరుగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో తలపడేందుకు సిద్ధమవుతున్నారు.

‘బీహార్ లాడెన్’గా పేరు పొందిన మీరజ్ ఖలీద్ నూర్ ఈ ఎన్నికల్లో నేరుగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. మోడీ పోటీ చేస్తున్న వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు నూర్ ప్రకటించారు. చాలా ఆలోచించాక మోడీపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.

పాట్నాకు చెందిన నూర్ గత ఎన్నికల్లో ఆర్జేడీ, ఎల్జేపీలకు అస్మదీయుడిగా ఉండేవారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్, ఎల్జేపీ అధినేత పాశ్వాన్‌లు ఒసామా బిన్ లాడెన్ పోలికలతో ఉన్న నూర్‌ను ప్రచార సభలకు తీసుకు వెళ్లేవారు. లాడెన్ మరణం తర్వాత వారు నూర్‌ను పట్టించుకోవడం మానేశారు. దీంతో నూర్ సొంతగా ‘రామ్ ఇండియా’ పేరిట సొంత పార్టీని ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement