'పూర్తి పేరు రాసినా.. పొట్టి పేరైనా ఓకే' | Election commission clarifies on YSRCP name | Sakshi
Sakshi News home page

'పూర్తి పేరు రాసినా.. పొట్టి పేరైనా ఓకే'

Mar 18 2014 10:23 AM | Updated on Aug 14 2018 4:32 PM

'పూర్తి పేరు రాసినా.. పొట్టి పేరైనా ఓకే' - Sakshi

'పూర్తి పేరు రాసినా.. పొట్టి పేరైనా ఓకే'

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పొట్టి పేరు రాసినా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పూర్తి పేరు రాసినా వారిని ఆ పార్టీ అభ్యర్థులుగా గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్

 సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పొట్టి పేరు రాసినా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పూర్తి పేరు రాసినా వారిని ఆ పార్టీ అభ్యర్థులుగా గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు, రిటర్నింగ్ అధికారులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా తమ పార్టీ పేరు బాగా ప్రాచుర్యం పొందినందున తమ పార్టీ అభ్యర్థులు పూర్తి పేరు రాసినా, పొట్టిపేరు రాసినా వారిని తమ అభ్యర్థులుగా పరిగణించాలని ఆ పార్టీ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం అందిందని తెలిపారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పార్టీ అభ్యర్థులందరికీ సీలింగ్ ఫ్యాన్ గుర్తును కేటాయించాలని నవీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement