సీపీఎస్‌ విధానం వద్దు | UTF Demand No CPS | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ విధానం వద్దు

Aug 28 2016 9:21 PM | Updated on Sep 4 2017 11:19 AM

ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి అమలులో ఉన్న కాంట్రిబ్యూటరి పెన్షన్‌ స్కీంను రద్దు చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఓబుళరెడ్డి డిమాండ్‌ చేశారు.

ప్రొద్దుటూరు: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి అమలులో ఉన్న కాంట్రిబ్యూటరి పెన్షన్‌ స్కీంను రద్దు చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఓబుళరెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక గాంధీరోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన యూటీఎఫ్‌ కార్యాలయాన్ని ఆదివారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేస్తూ వెంటనే ఉత్తర్వులు అమలు అయ్యేలా చూడాలని, రూ.398లతో పనిచేసిన స్పెషల్‌ టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆర్‌.లోకేశ్వరరెడ్డి, ప్రొద్దుటూరు అర్బన్, రూరల్, రాజుపాళెం, చాపాడు, దువ్వూరు మండలాలకు చెందిన యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement