గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి | to cooperate the library development | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి

Sep 21 2016 8:23 PM | Updated on Sep 4 2017 2:24 PM

గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి

గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి

హుజూర్‌నగర్‌ : గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు చేయూతనందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అల్లం ప్రభాకర్‌రెడ్డి కోరారు.

హుజూర్‌నగర్‌ : గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు చేయూతనందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అల్లం ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం పట్టణానికి చెందిన హెచ్‌ఎస్‌బీసీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మధిర మంజీర అందజేసిన రూ. 5 వేల విలువైన పుస్తకాలను ఆమె తండ్రి మధిర ప్రతాప్‌రెడ్డి స్థానిక శాఖ గ్రంథాలయానికి అంద జేశారు. అనంతరం ప్రతాప్‌రెడ్డిని శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో శాఖ గ్రంథాలయ చైర్మన్‌ కుంట సైదులు, గ్రంథాలయాధికారి మండవ వీరస్వామి, జూలకంటి వాణి, శ్రీనివాస్‌గౌడ్, ఊరె వెంకయ్య, కనకారెడ్డి, దొడ్డా నర్సింహారావు, వెంకటకృష్ణ, జాఫర్, రాజు, అబ్రహాం, రేణుక, శ్రీను, సీతారాం పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement