ఈ పొట్టేలు నాన్ వెజిటేరియన్ గురూ! | The ram is very hot Guru | Sakshi
Sakshi News home page

ఈ పొట్టేలు నాన్ వెజిటేరియన్ గురూ!

Jul 6 2016 2:56 AM | Updated on Sep 4 2017 4:11 AM

ఈ పొట్టేలు నాన్ వెజిటేరియన్ గురూ!

ఈ పొట్టేలు నాన్ వెజిటేరియన్ గురూ!

ఆకులు అలములు, పచ్చిక తిని కడుపు నింపుకొని, చెరువులు, కుంటల్లో నీరు తాగే పొట్టేళ్లను చూసి ఉంటాం.

ప్రకాశం : ఆకులు అలములు, పచ్చిక తిని కడుపు నింపుకొని, చెరువులు, కుంటల్లో నీరు తాగే శాకాహార పొట్టేళ్లను చూసి ఉంటాం. మాంసం తిని, మద్యం సేవించే మాంసాహార పొట్టేళ్లున్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామానికి చెందిన పువ్వాడ వెంకటనారాయణకు చెందిన ఐదు నెలల వయసున్న పొట్టేలు పచ్చగడ్డికి బదులు మాంసం ముక్కలు ఆరగిస్తోంది. ప్రతి ఆదివారం కేజీ మాంసం, బాటిల్ మందు తీసుకుంటోంది.

యజమాని మద్యాన్ని కూల్‌డ్రింక్ సీసాలో పోసి, దానికో పాలపీక ఏర్పాటు చేసి పట్టిస్తుంటే చప్పరించేస్తోంది. నెల రోజులుగా మాంసం, మద్యం లాగించేస్తున్న ఈ పొట్టేలును చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.        - పంగులూరు


 

Advertisement
 
Advertisement
Advertisement