నాకు న్యాయం చేయాలి | The girlfriend's concern in front of the boyfriend's house | Sakshi
Sakshi News home page

నాకు న్యాయం చేయాలి

Jul 12 2017 2:04 PM | Updated on Sep 5 2017 3:52 PM

ఓ యువతి తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది.

► ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
► మహిళా సంఘాల మద్దతు


హసన్‌పర్తి(వర్ధన్నపేట): ఓ యువతి తనకు న్యాయం  చేయాలని ఆందోళనకు దిగింది. ప్రియుడి ఇంటి ఎదుట మహిళ సంఘాల మద్దతుతో దీక్షలో కూర్చుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే సదురు యువతికి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించా రు. వివరాల్లోకి వెళ్లితే... వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం కన్నూరుకు చెందిన కోమల, హసన్‌పర్తికి చెందిన మానుపాటి శివకుమార్‌లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరికి ఏడాది క్రితం పెళ్లి కుదిరింది. ఘనంగా వరపూజ చేశారు.  

రైల్వేలో ఉద్యోగం రావడంతో..
శివకుమార్‌కు ఏడాది క్రితం రైల్వేలో ఉద్యోగం వచ్చింది. దీంతో మరో అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. దీంతో కోమల అప్పట్లో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  అయితే మంగళవారం హసన్‌పర్తికి వచ్చిన కోమల తనను పెళ్లి చేసుకోవాలని ఆందోళనకు దిగింది. దీనిపై సమాచారం అందుకున్న సీఐ పుల్యాల కిషన్‌ సంఘటన స్థలానికి చేరుకుని యువతిని శాంతిపజేశారు. శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement