నేడు గ్రూప్‌–2లో ఉచిత శిక్షణకు ఎంపికలు | selection for group 2 free coaching | Sakshi
Sakshi News home page

నేడు గ్రూప్‌–2లో ఉచిత శిక్షణకు ఎంపికలు

Dec 17 2016 11:56 PM | Updated on Sep 4 2017 10:58 PM

జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు గ్రూప్‌–2లో ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఈ నెల 19, 20వ తేదీల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ–వెలుగు పీడీ రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు గ్రూప్‌–2లో ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఈ నెల 19, 20వ తేదీల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ–వెలుగు పీడీ రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కేవీఆర్‌ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులతో హాజరుకావాలన్నారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌ నుంచి ప్రముఖ అధ్యాపకులచే ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా ఉచిత శిక్షణ తరగతులు ఇస్తామన్నారు. వివరాలకు 08518–277499, 8522083879, 8341581022, 9177016174 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement