నాలుగు రోజుల్లో వర్షసూచన | rain information | Sakshi
Sakshi News home page

వర్షసూచన

Sep 15 2017 10:00 PM | Updated on Jun 1 2018 8:45 PM

రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు 24 నుంచి 28 మి.మీ వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28 నుంచి 32 డిగ్రీలు, కనిష్టం 24 నుంచి 25 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు.  గంటకు 7 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement